Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసియా క్రీడలు: వర్షంతో మ్యాచ్ రద్దు.. నేరుగా సెమీస్‌కు టీమిండియా

Team India reaches Asian Games semi finals as match against Afghanistan cancelled due to rain
Advertisement
  • ఆసియా క్రీడల్లో భారత్-ఆఫ్ఘ‌నిస్థాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రద్దు
  • భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే క్యాన్సిల్ అయిన మ్యాచ్‌
  • మెరుగైన‌ ర్యాంకింగ్ ఆధారంగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన టీమిండియా
  • సెమీఫైనల్లో శ్రీలంక-నేపాల్ మ్యాచ్ విజేతతో తలపడనున్న భారత్
Advertisement
ఆసియా క్రీడల్లో భారత్, ఆఫ్ఘ‌నిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న టీమిండియా నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. కరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఉదయం 5:30 గంటలకు జరగాల్సిన పాకిస్థాన్-హాంకాంగ్ తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే కారణంతో రద్దయింది. ఆ మ్యాచ్‌లోనూ అధిక ర్యాంకింగ్ ఆధారంగా పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ 1 స్థానంలో ఉండగా.. ఆఫ్ఘ‌నిస్థాన్ 10వ స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్థాన్ 6వ ర్యాంకులో, హాంకాంగ్ 24వ ర్యాంకులో కొనసాగుతున్నాయి. ఈ నిబంధనల ప్రకారమే భారత్, పాక్ జట్లు ముందంజ వేశాయి.

సెమీఫైనల్లో శ్రీలంక, నేపాల్ మధ్య జరిగే మూడో క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడుతుంది. మరో సెమీస్‌లో బంగ్లాదేశ్, మలేషియా మధ్య జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్ విజేతతో పాకిస్థాన్ పోటీ పడుతుంది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్ మంగళవారం, సెమీఫైనల్స్ గురువారం జరగనున్నాయి.
Advertisement
Advertisement
Team India
Asian Games 2023
India vs Afghanistan
Cricket Semi Finals
ICC Rankings
Asian Games Cricket

More Telugu News